జనసేనలోకి వైకాపా నేతల భారీ చేరికలు
రిపోర్టర్: సురేష్
స్థలం: Andhra Pradesh
పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు జనసేన పార్టీలో చేరారు. వారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.