బొబ్బిలిలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి మువ్వల పద్మ జోరుగా ప్రచారం
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి మువ్వల పద్మ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, డిసిసి అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ సహకారంతో ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.