ఉత్తర ప్రదేశ్ లో విషాదం వివాహమైన మరుసటి రోజు దంపతులు మృతి
రిపోర్టర్: సురేష్
స్థలం: Uttar Pradesh
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థనగర్ జిల్లాలో వివాహమైన మరుసటి రోజే నూతన దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. జానియాజోట్ గ్రామానికి చెందిన దేశ్‌రాజ్ చౌహాన్, అనిత చౌహాన్ దంపతులు సోమవారం వివాహం చేసుకోగా, మంగళవారం ఉదయం తమ గదిలో వధువు నేలపై విగతజీవిగా పడి ఉండగా, వరుడు ఉరివేసుకొని కనిపిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.