పులివెందుల ఎన్నికల్ లో దౌర్జన్యం: రీపోలింగ్ నిర్వహించాలంటూ వైఎస్ జగన్ డిమాండ్

రిపోర్టర్: శివ స్థలం: పులివెందుల

ఏపీలో పట్టణ సంస్థల ఎన్నికల సందర్భంగా పులివెందులలో కూటమి ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడిందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, డెబ్బై బూతుల్ లో తమ ఏజెంట్లను అడ్డుకున్నారని, పోలీసులు టీడీపీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలను రద్దు చేసి వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టును మరోసారి ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు.