వైద్య లోపాలకు చెక్: మెడికల్ కాలేజీల్లో పేషెంట్ సేఫ్టీ సెల్స్ ఏర్పాటు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
ఆసుపత్రుల్లో వైద్య లోపాలను అరికట్టేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్లో ప్రత్యేకంగా పేషెంట్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు ఎన్ఎంసీ అధికారులు తెలిపారు. ప్రతి కళాశాలలో ఒక సీనియర్ ఫ్యాకల్టీని పేషెంట్ సేఫ్టీ నోడల్ ఆఫీసర్గా నామినేట్ చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో జీరో హార్మ్ సంస్కృతిని తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.