అమలాపురంలో తీవ్ర కలకలం: గ్యాస్ లీకై పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటలు

రిపోర్టర్: నరేష్ స్థలం: అమలాపురం

అమలాపురంలో భూగర్భ విద్యుత్ స్తంభం కోసం గుంత తవ్వుతుండగా గ్యాస్ పైప్ లైన్ దెబ్బతిని గ్యాస్ లీకైందని, దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారని అధికారులు తెలిపారు. అయితే గెయిల్ అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రధాన వాల్వ్లను మూసివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.