బెల్లంపల్లిలో రోడ్డు విస్తరణ పనుల పరిశీలన.. వేగవంతానికి ఆదేశాలు

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు, పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన చెట్ల తొలగింపు పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.

పనులను త్వరితగతిన పూర్తి చేసి, రోడ్డు విస్తరణను వేగవంతం చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు.