2027 యాషెస్ సిరీస్‌పై క్లారిటీ ఇవ్వని స్టీవ్ స్మిత్
రిపోర్టర్: రమేష్
స్థలం: Australia
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తన రిటైర్మెంట్ మరియు 2027 యాషెస్ సిరీస్‌లో ఆడే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. తాను సిరీస్ వారీగా భవిష్యత్తును నిర్ణయించుకుంటున్నానని, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. ఇంగ్లండ్‌లో యాషెస్ గెలవడం తన కల అయినప్పటికీ, అప్పటివరకు టెస్టు క్రికెట్‌లో కొనసాగుతానా లేదా అనేదానిపై ఎలాంటి స్పష్టత లేదని స్పష్టం చేశాడు.