అమ్రాబాద్ అడవుల్లో ఒకేసారి ప్రత్యక్షమై పర్యాటకులను మురిపించిన పెద్దపులులు

రిపోర్టర్: dumarla bhaskar senier journalist స్థలం: అచ్చంపేట

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పర్యాటకులకు మూడు పెద్ద పులులు కనిపించాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సఫారీలో వాహనంలో వెళుతుండగా పులులు రోడ్డుపైకి వచ్చాయి. దీంతో పర్యాటకులు సెల్ఫోన్లలో ఆ దృశ్యాలను బంధించారు. అటవీ శాఖ చేపట్టిన పకడ్బందీ సంరక్షణ చర్యల వల్లనే పులుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.