కాంగ్రెస్ నాయకుడు పల్లె ఉప్పలయ్య దశదిన కర్మకు ప్రవీణ్ రెడ్డి నివాళి

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె ఉప్పలయ్య దశదిన కర్మ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీమంత్రి స్వర్గీయ ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కుమారుడు ప్రవీణ్ రెడ్డి హాజరై ఉప్పలయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పల్లె శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.