'తెలంగాణ కేవలం భౌగోళిక ప్రాంతం కాదు': మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కరీంనగర్
కరీంనగర్ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కేవలం భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని, అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని అన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం తదితరులతో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు.