హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే బాలకృష్ణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హిందూపురం
హిందూపురం పట్టణ ఎన్నికల్లో మున్సిపల్ ఛైర్మన్ మరియు వార్డు అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం చేరుకున్న ఆయన ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత రెండున్నర సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని, కూటమి ప్రభుత్వంతోనే అన్ని సామాజిక వర్గాలకు సరైన న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.