విద్యార్థులకు తీపి కబురు: రాష్ట్రంలో డిసెంబర్ తొమ్మిది నుంచి ఉచిత అల్పాహార పథకం

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని డిసెంబర్ తొమ్మిదవ తేదీన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నవంబర్ ముై లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు హరేకృష్ణ ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల్లో పోషకాహార లోపాలను నివారించడంతో పాటు హాజరు శాతాన్ని గణనీయంగా పెంచడమే ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.