నగరిలో ఘనంగా ఓం శక్తి నవరాత్రి ఉత్సవాలు: భక్తుల సందడి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నగరి
చిత్తూరు జిల్లా నగరి పట్టణంలోని ఓం శక్తి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాల్లో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని నిర్వాహకులు జ్యోతి నాయుడు వెల్లడించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి పోటెత్తడంతో నగరి పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులందరికీ ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.