నందిగ్రామ్ ఉపఎన్నికలో తృణమూల్ అభ్యర్థి విరమణపై ఎంపీ ఖగేన్ ముర్ము ఘాటు వ్యాఖ్యలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: మాల్దా, పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సంచిత ప్రధాన్ నామపత్రం ఉపసంహరించుకోవడంపై బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేస్తే భారీ ఓటమి తప్పదని ముందే గ్రహించి మమతా బెనర్జీ వర్గం ఈ నాటకానికి తెరలేపిందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఓటమి భయంతోనే టీఎంసీ ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు.