ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై ఖమ్మం కలెక్టర్ కీలక ప్రకటన

రిపోర్టర్: శివ స్థలం: ఖమ్మం

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా బూత్ లెవల్ అధికారుల ద్వారా నోటీసులు అందిన ఓటర్లు వివరాలను పరిశీలించుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ సూచించారు. పేరు, ఇంటిపేరు, వయస్సులో తేడాలు లేదా మ్యాపింగ్ వివరాలు నమోదు కాకపోతే ప్రత్యేక లింక్ ద్వారా సరిచేసుకోవాలని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.