యూకేలో సాంకేతిక లోపం.. దాదాపు 300 విమానాలు రద్దు!

రిపోర్టర్: రమేష్ స్థలం: World

యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా మంగళవారం దాదాపు 300 విమానాలు రద్దు అయ్యాయి. లండన్‌లోని హీత్రూ, స్టాన్‌స్టెడ్ విమానాశ్రయాలతో పాటు మాంచెస్టర్, బర్మింగ్‌హామ్ విమానాశ్రయాలపై దీని ప్రభావం పడింది. సమస్య పరిష్కారానికి ఇంజినీర్లు ప్రయత్నిస్తున్నట్లు నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ వెల్లడించింది.