ఓటర్ల తప్పుల పుణ్యమా అని తలకిందులవుతున్న ఎన్నికల ఫలితాల లెక్కలు

రిపోర్టర్: విజయ్ స్థలం: సంగం

ఓటర్లు అత్యంత అప్రమత్తంగా ఉండి ఓటు హక్కును వినియోగించుకోవాలని, లేదంటే చెల్లని ఓట్లు అభ్యర్థుల తలరాతలను పూర్తిగా మార్చేస్తాయని ఎన్నికల పరిశీలకులు తెలిపారు. ఇటీవల జరిగిన ఆత్మకూరు పురపాలక సంఘం ఎన్నికల్లోనూ ఇదే తరహా ఘటనలు పునరావృతమయ్యాయని, గడిచిన ఐదేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మెజారిటీ ఓట్ల కంటే చెల్లని ఓట్ల సంఖ్యే అధికంగా ఉండటం విస్మయానికి గురిచేసిందని అధికారులు స్పష్టం చేశారు.