గుర్గావ్‌లో కార్గిల్ వీరుడిపై పార్కింగ్ సిబ్బంది అటాక్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హర్యానా

హర్యానాలోని గుర్గావ్‌లో ఘోర సంఘటన జరిగింది. కార్గిల్ యుద్ధ వీరుడు, రిటైర్డ్ ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ అమిత్ కుమార్ గుప్తాపై పార్కింగ్ సిబ్బంది ఇనుప రాడ్డుతో కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర తల గాయాలతో పాటు చేయి విరిగింది. కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన ఆయనను పార్కింగ్ వివాదం కారణంగా సిబ్బంది విచక్షణారహితంగా కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.