దేశంలో గ్రీన్ ఎనర్జీ రంగానికి పీఎం ధార పథకం ఆమోదం
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో హరిత ఇంధన రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ప్రతిష్టాత్మక పీఎం ధార పథకానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపిందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. పర్యావరణ పరిరక్షణను కాపాడుతూ ఇంధన అవసరాలను తీర్చడమే లక్ష్యంగా రూ.1,86,405 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మెగా ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.54,082 కోట్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు.