మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పై ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, అయితే కడపలో మాత్రం హింసకు వైకాపా ముందస్తు ఏర్పాట్లతో వచ్చినట్లు కనిపిస్తోందని ఏపీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసాంఘిక శక్తులపై ఎన్నికల అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని నారా లోకేష్ స్పష్టం చేశారు.