నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణ నిమిత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు కూడా కోర్టుకు వచ్చారు. హెచ్ఎండీఏ నుంచి సుమారు రూ.55 కోట్ల బదిలీ వ్యవహారంలో ఏసీబీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసును కోర్టు అక్టోబర్ 30కి వాయిదా వేసింది.