సింగరేణిలో బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

హైదరాబాద్ సింగరేణి భవన్ లో డైరెక్టర్లను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ సభ్యులు చిలుక రాజనర్సు, రత్నం ప్రవీణ్ కుమార్ కలిశారు. సింగరేణిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీతో పాటు ఎస్సీ వర్గీకరణ అనుగుణంగా ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ వినతులపై అధికారులు సానుకూలంగా స్పందించారు. అర్హులైన వారికి తగిన న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనితో సంస్థలో నియామకాలపై ఆశలు చిగురించాయి.