యూ/ఏ సర్టిఫికెట్ సంతరించుకున్న సుహాస్, సూరిల 'మండాడి' సినిమా.

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: India

టాలీవుడ్ నటుడు సుహాస్, కోలీవుడ్ నటుడు సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'మండాడి'. సెప్టెంబర్ 10న విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యూ/ఏ' సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. సముద్రం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.