షాకింగ్ ఘటన: బ్రిటన్ కోర్టులో ప్రసిద్ధ గాయకుడు క్రిస్ బ్రౌన్కు ఊరట

రిపోర్టర్: కృష్ణ స్థలం: London

లండన్ నైట్క్లబ్లో సంగీత నిర్మాత అబ్రహం డయావ్పై దాడి చేసిన కేసులో గ్రామీ అవార్డు గ్రహీత, ప్రముఖ గాయకుడు క్రిస్ బ్రౌన్కు బ్రిటన్ కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ ఏడాది పాటు సస్పెండ్ చేసింది. లండన్లోని సౌత్వార్క్ క్రౌన్ కోర్టు జడ్జి టోనీ బౌమ్గార్ట్నర్ ఈ తీర్పు వెల్లడించారు. సెలబ్రిటీ హోదా ప్రత్యేక రక్షణ ఇవ్వదని జడ్జి స్పష్టం చేయగా, క్రిస్ బ్రౌన్ తన నేరాన్ని అంగీకరించడంతో తక్షణ జైలు శిక్ష తప్పింది.