విజయనగరం జిల్లాలో దారుణం: అనుమానంతో భార్యను కడతేర్చిన ఇంజినీర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Vizianagaram
విజయనగరం జిల్లా రాజాంలో తీవ్ర కలకలం రేపిన లలితా కుమారి హత్య కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి. భార్య లలితా కుమారి తెల్లవారుజామున యోగా తరగతికి వెళ్తుండగా అనుమానంతో భర్త కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంజినీరింగ్ చదివించి ప్రయోజకుడిని చేసిన భార్యపైనే అనుమానం పెంచుకుని ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర విషదాన్ని నింపింది. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.