ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ బయోపిక్ 'ఆర్టిఫిషియల్' టీజర్ విడుదల

రిపోర్టర్: భాస్కర్ స్థలం: World

ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ జీవిత కథాంశంతో తెరకెక్కుతున్న హాలీవుడ్ చిత్రం 'ఆర్టిఫిషియల్' అధికారిక టీజర్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సిలికాన్ వ్యాలీ రాజకీయం, బోర్డు రూమ్ కుట్రలు మరియు హై-వోల్టేజ్ కార్పొరేట్ సంక్షోభం ఆధారంగా రూపొందిన ఈ థ్రిల్లర్ చిత్రంలో ఆండ్రూ గార్ఫీల్డ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.