దీపావళి బాణసంచా దుకాణాల ఏర్పాటుకు వాట్సప్ ద్వారా అనుమతులు జారీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
దీపావళి సందర్భంగా రాష్ట్రంలో తాత్కాలికంగా బాణసంచా దుకాణాల ఏర్పాటు కోసం అగ్నిమాపక శాఖ సరికొత్తగా వాట్సప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తుదారులు నిర్ణీత నంబర్ కు తమ వివరాలు పంపి, ఆన్లైన్ లో రుసుము చెల్లించి సులభంగా అనుమతి పత్రాన్ని పొందవచ్చని అధికారులు తెలిపారు. భద్రతా నిబంధనలను పాటిస్తూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అగ్నిమాపక శాఖ స్పష్టం చేసింది.