జండా బాలాజీ ఆలయంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా పూజలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నిజామాబాద్ రూరల్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయంలో దేవదాయశాఖ జాయింట్ యాక్షన్ కమిటీ జనరల్ సెక్రెటరీ రాములు, ఆలయాల ఉద్యోగుల సంఘం కోశాధికారి కిషోర్ జాతర ఉత్సవంలో భాగంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆంజనేయులు స్వామివారి శేష వస్త్రంతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.