మహిళలపై అరాచకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రియాంక గాంధీ

రిపోర్టర్: విజయ్ స్థలం: Wayanad, Kerala

జముయిలో మహిళపై వేధింపుల ఘటన అత్యంత హేయమైనదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలపై అరాచకాలు, నేరాలు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆమె మండిపడ్డారు. మహిళలకు దేశంలో రక్షణ కరవైందని, వారిపై హింసాత్మక ఘటనలు మరింత పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.