మయన్మార్ జాతీయులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: లక్నో
భారత్‌లోకి అక్రమంగా చొరబడి, ఫోర్జరీ పత్రాలతో నకిలీ ధృవీకరణ పత్రాలు పొందిన నలుగురు మయన్మార్ జాతీయులకు లక్నోలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం దర్యాప్తు చేపట్టిన ఈ కేసులో దోషులుగా తేలిన హఫీజ్ షఫీక్, మొహమ్మద్ ఇస్మాయిల్, అజీజుర్ రెహమాన్, ముఫీజుర్ రెహమాన్‌లకు శిక్ష ఖరారైంది.