పన్నెండేళ్లు కష్టపడితే టెక్ దిగ్గజం ఒరాకిల్ ఇచ్చిన బహుమానం ఇదేనా?
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: India
టెక్ దిగ్గజం ఒరాకిల్ మరోసారి భారీ లేఆఫ్స్‌కు తెరదీసింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఏకంగా 12 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగి సిస్టమ్ లాగిన్‌ను నిలిపివేసింది. భార్యకు సర్జరీ జరుగుతున్న సమయంలోనూ విధులకు కట్టుబడి పనిచేసిన సౌరభ్ అనే ఉద్యోగిని అకారణంగా తొలగించడంపై ఆయన భార్య పూజా సాహు లింక్డ్‌ఇన్‌లో పెట్టిన భావోద్వేగ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.