ప్రముఖ గాయని నినా సిమోన్ బాల్య ఇల్లు పునరుద్ధరణ పూర్తి
రిపోర్టర్: రాజేష్
స్థలం: Tryon, North Carolina
అమెరికాలో ప్రసిద్ధ గాయని, పీయూనిస్ట్ నినా సిమోన్ బాల్యపు ఇల్లు ఎట్టకేలకు పూర్తిగా పునరుద్ధరించబడినట్లు నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారిక్ ప్రిజర్వేషన్ అధికారులు తెలిపారు. నార్త్ కరోలినాలోని ట్రయాన్ నగరంలో ఉన్న ఈ చిన్న ఇంటిని కూల్చివేత నుండి కాపాడేందుకు 2016లో నలుగురు కళాకారులు ముందుకు వచ్చి కొనుగోలు చేశారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత ఈ చారిత్రక భవనాన్ని సరికొత్తగా తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ ప్రాంగణాన్ని సందర్శకుల కోసం అందుబాటులోకి తెస్తామని వారు పేర్కొన్నారు.