కొత్త పింఛన్ల పండుగతో సంబరపడి మురిసిపోయిన తెలంగాణ నిరుపేదలు
రిపోర్టర్: SD. SHAHID REPORTER
స్థలం: లక్సెట్టిపేట
దీపావళి కానుకగా తెలంగాణ ప్రభుత్వం మరో నాలుగున్నర లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేయనుంది. ఈ విషయాన్ని మంత్రి సీతక్క వెల్లడించారు. ఆదివారం కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులకు ఈ నెల నుంచే అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ల చెల్లింపులు ప్రారంభమవుతాయి.