అనకాపల్లిలో గంజాయి స్మగ్లర్పై ఉక్కుపాదం: పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

అనకాపల్లి జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణాను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు గొలుగొండ మండలం పాత కేడీపేటకు చెందిన అలవాటుపడ్డ నేరస్థుడు ఉప్పాటి వెంకటేశ్పై పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం కింద డిటెన్షన్ ఉత్తర్వులు అమలు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నాలుగు కేసులు ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.