'కేసులో పూర్తి నిజాలు బయటపెడతాం': రేణుకాస్వామి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన ప్రదోష్

రిపోర్టర్: గోపి స్థలం: బెంగళూరు

బెంగళూరులోని సివిల్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన రేణుకాస్వామి హత్య కేసులో 14వ నిందితుడైన ప్రదోష్ ఎస్. రావు అప్రూవర్‌గా మారేందుకు అనుమతించింది. హత్య కుట్ర, సాక్ష్యాల ధ్వంసంపై పూర్తి నిజాలు వెల్లడిస్తానంటూ ప్రదోష్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, పవిత్రా గౌడ పాత్రలపై ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న పి. కుమార్ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ కీలక నిర్ణయం వెలువరించింది.