గ్రామీణ భారతదేశంలో దశాబ్ద కాలంగా వస్తున్న పెను మార్పులు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
గ్రామీణ భారతదేశంలో గత దశాబ్ద కాలంలో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ కుటుంబాలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 2017 నుంచి 2023 మధ్య కాలంలో సుమారు 13 కోట్ల 40 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయని ఆయన తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉపాధి రంగంలోకి ప్రవేశిస్తూ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.