తిరుమల శ్రీవారి సేవలో భారత కౌన్సిల్ జనరల్ లారా విలియమ్స్
రిపోర్టర్: వెంకట్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భారత కౌన్సిల్ జనరల్ లారా విలియమ్స్ దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. ఆలయానికి చేరుకున్న ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు అలాగే దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.