కాకినాడ ఎన్టీఆర్ బీచ్‌ను ముంచెత్తుతున్న రాకాసి అలలతో పోలీసుల ఆంక్షలు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: కాకినాడ రూరల్
కాకినాడ రూరల్ పరిధిలోని ఎన్టీఆర్ బీచ్ వద్ద తుఫాన్ ప్రభావంతో సముద్రం ముందుకు వచ్చింది. అలలు ఎగసిపడుతుండటంతో తీర ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సెల్ఫీలు తీసుకునేందుకు యువకులు ఎగబడుతుండటంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు కోరారు.