జహీరాబాద్ ఎంపీ కార్యలయంలో శ్రీనివాస్ రెడ్డి ఘన సన్మానం: ఆశీర్వదించిన నేతలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీ కార్యాలయంలో న్యాల్కల్ మండల మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. మండల అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు కొనియాడారు. ఆయన జీవితంలో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ గిరిధర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.