శ్రీకాకుళంలో గణేష్ ఉత్సవాలకు ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరి
రిపోర్టర్: కిరణ్
స్థలం: Srikakulam
శ్రీకాకుళం జిల్లాలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత అనుమతులు తప్పనిసరి అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మండపాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటును ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి తప్పనిసరి చేశారు. భద్రతా పరమైన నిబంధనలను పాటిస్తూ, నిర్వాహకులు ముందుగానే అనుమతులు పొందాలని అధికారులు సూచించారు. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని జిల్లా యంత్రాంగం పిలుపునిచ్చింది.