టెక్నాలజీ విషాదం: చాట్జీపీటీ సలహాతో మూర్ఛ మందు మానేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి

రిపోర్టర్: గోపి స్థలం: సియాటిల్

అమెరికాలోని సియాటెల్కు చెందిన ముప్పై ఒకే ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ బోవెన్ వాన్ మూర్ఛ మందులను తగ్గించాలంటూ చాట్జీపీటీ ఇచ్చిన సలహాలను పాటించి మృతి చెందిందని, దీనిపై ఆమె తల్లిదండ్రులు ఓపెన్ఏఐ సంస్థపై కేసు వేశారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. మందులు మానేయడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని, కృత్రిమ మేధ సురక్షిత ప్రమాాలపై ఈ ఘటన తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తోందని ఆమె తల్లిదండ్రులు వాపోయారు.