టీచర్ల జోలికొస్తే వైకాపా అధినేత జగన్ ఖబడ్దార్ అంటూ నారా లోకేశ్ హెచ్చరిక

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అనంతపురం

టీచర్ల జోలికొస్తే వైకాపా అధినేత జగన్ ఊరుకునేది లేదని, ఎవరినీ వదిలిపెట్టబోమని మంత్రి నారా లోకేశ్ అనంతపురం జిల్లా రాప్తాడులో హెచ్చరించారు. రాప్తాడులో ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలను ఆవిష్కరించిన ఆయన, టీచర్లపై దాడులు చేయడం, బూతులు మాట్లాడటం వైకాపా సంస్కారంగా మారిందని మండిపడ్డారు. రెడ్‌ బుక్ అమలవుతుందని, తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.