నెల్లూరులో స్థానిక ఎన్నికల వేడి: పకడ్బందీ భద్రతతో పోలీసులు అప్రమత్తం
రిపోర్టర్: రమేష్
స్థలం: నెల్లూరు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించామని తెలిపారు. చెక్‌పోస్టుల ద్వారా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆమె స్పష్టం చేశారు.