'ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు': G Kishan Reddy

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి G Kishan Reddy ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ద్వారా అమరుల త్యాగాలకు సముచిత గౌరవం కల్పించినందుకు ప్రధాని మోడీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను G Kishan Reddy మరోసారి స్పష్టం చేస్తూ, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం అడుగులు వేస్తోందని వెల్లడించారు.