ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కాక్రోచ్ జనతా పార్టీ

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

ఓటు హక్కును కాపాడుకునేందుకే ఎన్నికల సంస్కరణలపై దృష్టిసారించినట్లు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజీత్ దిప్కే ప్రకటించారు. పాఠశాలలు, గిరిజన విద్యపై పోరాటం చేసినా ఓట్లు దొంగిలిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన మండిపడ్డారు. ఈసీ పనితీరుపై దిల్లీలో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించనున్నట్లు సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు.