హైదరాబాద్లో మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ ప్రాంతంలోని గౌతమ్ నగర్ క్రాస్ రోడ్స్ వద్ద నిర్వహించనున్న మన్ కీ బాత్ కార్యక్రమంలో కేంద్రమంత్రి G Kishan Reddy పాల్గొననున్నారు. ఈ నెల 27వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలతో కలిసి వీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా క్రీడాకారులు వివిధ పోటీల్లో పతకాలు సాధిస్తూ దేశ కీర్తిని ఇనుమడింపజేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన ప్రాచీ చౌదరి, తేజిందర్పాల్ సింగ్ తూర్లకు ఆయన అభినందనలు తెలిపారు.