వైజాగ్ నుంచి బ్యాంకాక్‌కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
రిపోర్టర్: వెంకట్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నుంచి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు అక్టోబర్ 27 నుంచి తొలి అంతర్జాతీయ నాన్‌స్టాప్ విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ సర్వీసును వారానికి రెండుసార్లు నడపనుంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరుతుండటంతో పర్యాటకులు, వ్యాపార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వన్-వే ఎకానమీ ఛార్జీలను రూ. 16,300 నుండి రూ. 19,400 మధ్య నిర్ణయించారు.