ప్రమాద బీమాతో ఆర్థిక భద్రత.. ఎస్బీఐ పథకంపై అవగాహన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మలికిపురం

దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ప్రమాద బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని లక్కవరం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రుద్రరాజు గోపాలకృష్ణరాజు మంగళవారం సూచించారు.

సంవత్సరానికి రూ.3 వేల ప్రీమియంతో రూ.60 లక్షల వరకు ప్రమాద బీమా పొందవచ్చని ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు మృతి, పాముకాటు, విద్యుత్ షాక్ వంటి దురదృష్టకర ఘటనలకు ఈ బీమా వర్తిస్తుందని, ప్రతి కుటుంబం దీనిని పరిశీలించాలని పేర్కొన్నారు.