తిరుమల భక్తుల ప్రమాద బీమా రూ.10 లక్షలకు పెంపు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తిరుపతి
తిరుమలలో ప్రమాదవశాత్తూ మరణించే భక్తుల కుటుంబాలకు అందించే బీమా మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఛైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఎల్‌ఐసీ ద్వారా ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ అమలుకు ఆమోదం తెలిపారు. సహజ మరణానికి రూ.2 లక్షలు అందజేయనున్నారు. అలాగే లడ్డూల తయారీకి 400 అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి నిర్ణయించారు.